ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

SRPT: నేరేడుచర్ల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.