ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్, అంతర్గాం, తాటిపల్లి, చలిగల్ (ఎఎంసీ), మోరపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బీ. సత్య ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ధాన్యం స్వీకరణ, తూకం, మాయిశ్చర్ పరీక్షలను సమీక్షించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు.