రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే రమణమూర్తి

రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే రమణమూర్తి
SKLM: జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. జలుమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రంలో ఆయన పాల్గొని, స్థానిక యువతతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.