మల్కాజ్‌గిరిలో UTS యాప్‌పై ఫిర్యాదులు
MDCL: ట్రైన్ టికెట్ బుకింగ్ UTS యాప్ సరిగ్గా పనిచేయడం లేదని మల్కాజ్‌గిరి, బొల్లారం ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. లాగిన్ అయిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ కనిపించకపోవడం, టికెట్ బుకింగ్ సమయంలో ఎర్రర్ మెసేజ్‌లు రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజువారీ ప్రయాణికులు డిజిటల్ టికెట్ సేవలపై ఆధారపడుతున్న నేపథ్యంలో వెంటనే లోపాలను సరిచేయాలని కోరుతున్నారు.