VIDEO: క్రికెటర్‌ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
SRCL: తంగళ్ళపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో అండర్ 14 క్రికెటర్ పాలకుర్తి ఆశ్రిత్ సాయిని కాంగ్రెస్ నాయకులు ఇవాళ సన్మానించారు. మండలంలోని సారం పెళ్లికి చెందిన ఆశ్రిత్ సాయి జిల్లా స్థాయిలో ఆడేందుకు సెలెక్ట్ కాగా అతనిని కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించి సత్కరించారు. మండల అధ్యక్షుడు టోనీ మాట్లాడుతూ.. ఆశ్రిత్ బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలన్నారు.