పెట్రోల్ బంక్‌ను పరిశీలించిన ఆర్డీవో
VZM: బొబ్బిలిలో గత ఆరు నెలలుగా మూతపడ్డ హిందుస్థాన్ పెట్రోలియం బంక్‌ను రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ రావు గురువారం పరిశీలించారు. వినియోగదారులకు విక్రయాలను నిలిపివేయడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కార్యకలాపాలు పునఃప్రారంభించకపోతే బంక్‌ను ఇతరులకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీను పాల్గొన్నారు.