సొంత ప్రభుత్వంపై మాజీమంత్రి సంచలన ఆరోపణలు
బీహార్‌లోని సొంత ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, BJP నాయకుడు RK సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో రూ.62,000 కోట్ల అవినీతి కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. చాలా ఎక్కువ ధరలకు ఓ ప్రైవేట్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు శాఖ ఒప్పందం కుదుర్చుకుందని, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలు చేకూరాయన్నారు.