నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్యార వేదిక: కలెక్టర్

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్యార వేదిక: కలెక్టర్

కృష్ణా: కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్యార వేదిక నిర్వహిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ పరిష్యార వేదిక ఉంటుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కాల్ సెంటర్‌లోని 1100 నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు వాటి స్థితిని కూడా తెలుసుకోవచ్చన్నారు.