రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

HNK: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ తెలిపారు. మృతుడి ఎడమ చేతిపై లాలా అనే పచ్చబొట్టు ఉందని, నలుపు, ఆకుపచ్చ చిన్న గల్లా షర్టు, నలుపు ప్యాంటు ధరించాడని చెప్పారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు.