పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA
ప్రకాశం జిల్లా ఒంగోలులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ కాలనీలో రూ. 46 లక్షలు, 46వ డివిజన్ రావి ఆంజనేయులు వీధిలో రూ. 16 లక్షలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో రూ. 1.25 కోట్లతో డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.