VIDEO: చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. రక్షించిన స్థానికులు

KRNL: కోడుమూరు నియోజకవర్గంలో గురువారం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. సి. బెళగల్ మండలంలోని పోలకల్-గూడూరు రహదారిలో వాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో ఒక ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుంది. దీంతో స్థానికులు ట్రాక్టర్ సాయంతో తాళ్లు కట్టి బస్సును బయటకు తీశారు. ప్రయాణికులు బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు.