వైద్య రంగ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
కోనసీమ జిల్లాలో వైద్య రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నాబార్డ్ నిధుల పనులపై వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.