రెండు రోజుల పాటు వర్షాలు

రెండు రోజుల పాటు వర్షాలు

AP: రాష్ట్రంలో రెండు రోజల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. రేపు పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి అల్లూరి జిల్లా, తూ.గో, కోనసీమ, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.