మచిలీపట్నంలో బాలయ్య బాబు అభిమానులు సందడి
కృష్ణా: మచిలీపట్నంలో నటరత్న బాలకృష్ణ అభిమానుల సందడి ఆకాశాన్నింటింది. అఖండ సినిమా బెనిఫిట్ షో స్థానిక సిరికృష్ణ G3 థియేటర్లో గురువారం రాత్రి ప్రదర్శించారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహాలంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. బాలయ్య బాబు చిత్రపటానికి హారతులు ఇచ్చి 'జై బాలయ్య - జై జై బాలయ్య' అనే నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది.