కూసుమంచి నుంచి జీళ్లచెరువుకు శివస్వాముల పాదయాత్ర

కూసుమంచి నుంచి జీళ్లచెరువుకు శివస్వాముల పాదయాత్ర

KMM: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూసుమంచిలో శివస్వాములు ఆధ్యాత్మిక సందడి చేశారు. మండల కేంద్రంలోని శివాలయం నుంచి జీళ్లచెరువులోని శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం వరకు శనివారం పాదయాత్ర చేపట్టారు. శివమాల ధరించిన అనంతరం ఏటా సంప్రదాయబద్ధంగా కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటామని భక్తులు తెలిపారు.