మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఒడిశాలోని కటక్ SCB మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం మోహన్ చరణ్ మాంఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు తక్షణ సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు.