పెద్ద తండాలో సర్పంచ్–ఉప సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
WGL: సంగెం మండలం పెద్ద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను తండా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గుగులోట్ వినోద్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ నాయకుల సహకారంతో తండా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.