ఈనెల 16వ తేదీన 22A కేసుల ఫిర్యాదుల స్వీకరణ
ELR: జిల్లాలో 22A కేసుల పరిష్కారానికి ఈనెల 16వ తేదీన ఏలూరులో మెగా పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలు తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. జిల్లాలోని రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.