30న లోక్‌సభలో నక్సలిజంపై కీలక చర్చ
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే, లోక్‌సభలో మార్చి 30న నక్సలిజంపై కీలక చర్చ జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ధేశించిన 2026 మార్చి గడువుపై పార్లమెంటులో చర్చ నిర్వహించనున్నారు. రూల్ 193 కింద నక్సలిజంపై ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చ ప్రారంభించనున్నారు. దేశంలో నక్సలిజం అంతానికి తీసుకుంటున్న చర్యలపై లోక్‌సభలో ప్రత్యేక సమయం కేటాయించారు.