నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
BPT: రేపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల అత్యవసర మరమ్మతుల దృష్ట్యా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని డీఈ శ్యాంసుధాకరబాబు తెలిపారు. రేపల్లె బస్టాండ్ సెంటర్, గరువు, ఉప్పూడి, నిజాం పట్నం రోడ్లు, ఇసుకపల్లి, ఉప్పూడి గ్రామంలో సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారుల ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.