మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అరెస్టు
WGL: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో శుక్రవారం నిరసనకు దిగిన మాజీమంత్రి సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.