అధికారుల సమన్వయంతో సమస్య పరిష్కారం: కార్పొరేటర్

RR: మన్సురాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని వీరభద్ర నగర్ కాలనీలో డ్రైనేజీ మురుగునీరు కాలనీ రోడ్లపై ప్రవహిస్తూ చెరువును తలపిస్తుందని కాలనీవాసులు నేడు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి తెలిపారు. స్పందించిన కార్పొరేటర్ HMWS&SB, GHMC అధికారుల సమన్వయంతో సమస్యను పరిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.