ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా నగరంలో భారీ

HYD: ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా నేడు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. ఇవాళ సా.6 గంటలకు పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత, పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు.