7న జాబ్ మేళా

SDPT: ఇన్‌స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనె 7న గజ్వేల్లోని ప్రగతి జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు గోపాల్ తెలిపారు. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్టు కలిగిన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. ఈ సందర్భంగా గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.