పినపాక మండలంలో ఎమ్మెల్యే పర్యటన వాయిదా

BDK: పినపాక మండలంలో నేడు జరగాల్సిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ఆకస్మికంగా వాయిదా పడింది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం జరగాల్సిన ఈ కార్యక్రమం, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన సాయంత్రం 5 గంటలకు ఉండటంతో రద్దు చేశారు. ఈ విషయాన్ని క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈ మార్పును కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు గమనించాలని కోరారు.