రేపు చింతపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

రేపు చింతపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

ASR: చింతపల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రేపు ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ కిల్లో ఊర్మిళ, కార్యదర్శి జగ్గన్న తెలిపారు. ఈ శిబిరంలో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, తదితర జంతువులకు నిపుణులైన పశువైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అనంతరం అవసరమైన మందులు, ఇంజక్షన్లు ఉచితంగా అందజేస్తారని పేర్కొన్నారు.