నూతన హెచ్ఎంగా రాజేశ్వరరావు

MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల హెచ్ఎంగా రాజేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆ పాఠశాల కార్యాలయంలో ఇంఛార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ నుండి ఆయన గెజిటెడ్ హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన హెచ్ఎం రాజేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.