హిందీ వివాదం.. సీఎం సంచలన వ్యాఖ్యలు
దేశంలో హిందీ వివాదం వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాషలు దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు మాతృభాషలోనే నేర్చుకుంటారని కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదన్నారు.