పైలట్ శిక్షణ రంగంలోకి అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ప్రముఖ పైలట్ శిక్షణ సంస్థ 'ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (FSTC)'లో 72.8% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలు ప్రకటించాయి. ఈ డీల్ విలువ రూ.820 కోట్లు. ఈ వాటా కొనుగోలు ప్రక్రియలో అదానీ అనుబంధ సంస్థ ADSTL, HASL పాల్గొన్నాయి. FSTC 11 ఫుల్-ఫ్లైట్ సిమ్యులేటర్లు, 17 శిక్షణ విమానాలను నిర్వహిస్తోంది.