కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
KMR: బాన్సువాడ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 178 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో చెక్కులను పంపిణీ చేశారు. సుమారు రూ. 1.78 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. బాన్సువాడ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల నుంచి లబ్ధిదారులు తరలివచ్చారు.