SU డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.