'రైతన్న.. మీకోసం'లో కర్నూలుకు రాష్ట్రంలో మొదటి స్థానం
KRNL: వారం రోజులు నిర్వహించిన 'రైతన్న.. మీకోసం'లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచసూత్రాలు వివరించి, ఫొటోలు పోర్టల్లో అప్లోడ్ చేయడం అత్యధిక శాతం నమోదు కావడంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ఈనెల 2, 3వ తేదీల్లో రైతు సేవా కేంద్రాల్లో వర్క్ షాప్ లు నిర్వహిస్తామన్నారు.