ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం వద్ద బుధవారం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి రమణారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం కనిగిరికి వచ్చి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బండరాయిని ఢీకొనడంతో రమణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.