స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: పీలేరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం స్త్రీ శక్తి పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని పథకం ప్రారంభాన్ని సూచించారు. ఈ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళా సాధికారతకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.