VIDEO: కంటి ఆపరేషన్లకు 50 మంది ఎంపిక

CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు శిబిరానికి వచ్చారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుండి వచ్చిన డాక్టర్ మురళీకృష్ణ కంటి పరీక్షలు చేసి, 50 మందికి ఆపరేషన్ అవసరమని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు మునస్వామి, చెంగారెడ్డి, దిలీప్ కుమార్ పాల్గొన్నారు.