అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ATP: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై CM చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. అనంతపురం, శ్రీసత్యసాయి సహా ఆరు జిల్లాల్లో 1,215 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారు. ఉద్యాన పంటలైన అరటి, మామిడికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. బాధిత రైతులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.