VIDEO: ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా గుంతలు

VIDEO: ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా గుంతలు

ASF: బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు నుంచి మట్టి కొట్టుకుపోవడంతో ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతతో పనులు చేపట్టకపోవడంతో ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.