కొత్తపల్లిలో రక్తదానం చేసిన యువకులు
CTR: పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం యువకులు రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 50 మంది యువకులు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని వారు తెలిపారు. రక్తం విలువ పెంచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నిర్వహకులు పేర్కొన్నారు.