సురవరాన్ని ఎప్పుడూ మరచిపోలేను: చంద్రబాబు

TG: సురవరం సుధాకర్ రెడ్డితో తనకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 'నేనంటే సుధాకర్‌కు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయన్ని జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. వ్యక్తిగతంగా నేను చేసే పనులను ఆయన ప్రోత్సహించేవారు. అలాంటి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి చనిపోవడం బాధాకరం. ఆయన మరణం CPIకి ఎంత నష్టమో.. సమాజానికి అంతే నష్టం' అని చంద్రబాబు తెలిపారు.