విద్యార్థులకు బ్యాగులు, టపాసులు పంపిణీ
NRML: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మామడ మండలం గోండుగూడా గ్రామంలో ఆదివారం గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు టపాసులను పంపిణీ చేశారు. సంస్థ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిరుపేద ఆదివాసి పిల్లల ఆనందాన్ని నింపే లక్ష్యంతో దీపావళి వేడుకలు నిర్వహించడానికి టపాసులు, స్వీట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.