పెద్దాపురంలో రెవెన్యూ అంశాలపై శిక్షణా కార్యక్రమం

KKD: పెద్దాపురంలో రెవెన్యూ అంశాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కె. శ్రీరమణి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి,ఏలేశ్వరం మండలాల అధికారులకు రెవెన్యూ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆయా మండలాల తహశీల్దార్లు, డీటీలు, రీ సర్వే డీటీలు, మండల సర్వేయర్లు, వీర్వోలు పాల్గొన్నారు.