VIDEO: ‘బడి పిలుస్తోంది’ ర్యాలీతో అవగాహన
NDL: ప్రభుత్వ పాఠశాల విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హెచ్‌ఎం కౌసల్యాబాయి అన్నారు. నందికొట్కూరు బైరెడ్డి నగర్ కాలనీలో ‘బడి పిలుస్తోంది’ ర్యాలీ నిర్వహించారు. విద్య ఆవశ్యకతపై నినాదాలు చేస్తూ బ్యానర్లతో ఇవాళ అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత శిఖరాలు చేరవచ్చని ఆమె తెలిపారు.