VIDEO: యాదాద్రి స్వామికి ఘనంగా శతఘటాభిషేకం

VIDEO: యాదాద్రి స్వామికి ఘనంగా శతఘటాభిషేకం

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శతఘటాభిషేకంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం ప్రధాన కలశం, భిందతీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ చేసి, 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంభు మూర్తులను అభిషేకించారు. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.