ఎరువులు వాడకంపై రైతులకు అవగాహన
ప్రకాశం: అవసరానికి మించి రసాయన ఎరువులువాడటం వలన నేలలోని భూ భౌతిక లక్షణాలు దెబ్బతింటాయని, నేలలు నిస్సారమైపోతాయని వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ అన్నారు. మర్రిపూడి మండలంలోని గుండ్ల సముద్రంలో ఏర్పాటు చేసిన రసాయన ఎరువుల వాడకంపై రైతుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు తనకు ఉన్న పొలంలో ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకోవాలని సూచించారు.