అధికారులకు వినతిపత్రాల అందజేత
PDPL: సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లావ్యాప్తంగా ధర్నా, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఈ, డీఈలకు జేఏసీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా JAC అధ్యక్షులు మల్లు కిషన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రాపోలు సురేశ్ రావు, విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.