VIDEO: 400 కే.వీ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన
MDK: శివంపేట మండలం గోమారం 400 కే.వీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆర్టిజన్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.