ఇరాన్‌కు మద్దతుగా పాక్‌లో ఉద్రిక్తత
పాక్ కరాచీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూఎస్ కాన్సులేట్‌పై ఆందోళనకారులు దాడులు చేశారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. అనంతరం ఇరాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. గేట్లు దాటుకుని లోపలికి వెళ్లిన నిరసనకారులు యూఎస్ కాన్సులేట్‌కు నిప్పుపెట్టే యత్నం చేశారు. దీంతో వారని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించి కాల్పులు జరిపారు.