'రజాకర్ల అరాచకాలపై పోరాడిన ధైర్యశాలి షోయబుల్లా ఖాన్'

KMM: రజాకార్ల అరాచకాలపై పోరాడి ప్రపంచానికి తెలిసేలా చేసిన ధైర్యశాలి షోయబుల్లా ఖాన్ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం (M) సుబ్లేడులో ఖాన్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.