VIDEO: వన దుర్గమ్మకు సౌమ్యవాసరే పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి శివారులో వెలసిన శ్రీ ఏడుపాయల క్షేత్రంలో బుధవారం తెల్లవారుజామున దుర్గమ్మకు సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం మంగళహారతి, నైవేద్యం సమర్పించారు.