'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: డెంకాడ మండలం కేంద్రంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతుల ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.